గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ను కోవిడ్ ఆస్పత్రిగా మార్చే విషయాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. ఈరోజు ఎయిమ్స్ వైద్యులతో సమావేశమైంది. కరోనా నివారణ చర్యలపై ఐదు అంశాలపై ప్రధానంగా చర్చించామని వైద్యాధికారులు తెలిపారు. త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మరో రెండు వారాల్లో 25 పడకల ఐసోలేషన్ వార్డు, 3 వెంటిలేటర్లు, కరోనా నిర్థరణ పరీక్షల కిట్స్ సిద్ధమవుతున్నట్లు ఎయిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ కేంద్ర బృందానికి వివరించారు.
ఇదీ చదవండి: నడినెత్తిన మంటలు.. పొట్టలో ఆకలి దప్పులు..