Three Capitals Game No Central Institutions: దేశంలో ఏ రాష్ట్ర రాజధానిని తీసుకున్నా.. అనేక కేంద్ర ప్రభుత్వ విభాగాలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన.. పరిశోధన సంస్థలతో కళకళలాడుతూ ఉంటాయి. వాటిలో.. ఆర్‌బీఐ, నాబార్డ్, విదేశ్ భవన్, ప్రభుత్వరంగ బ్యాంకుల కార్యాలయాలు వంటివి విధిగా ఏర్పాటయ్యేవైతే స్థానిక అనుకూలతలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చొరవ, చూపించే శ్రద్ధ, కేంద్ర మంత్రిత్వ శాఖల్ని.. ఒప్పించే నైపుణ్యం వల్ల వచ్చేవి మరికొన్ని ఉంటాయి.
జగన్ సర్కార్‌లో.. ఆ చొరవా, శ్రద్ధా మచ్చుకైనా కానరావు సరికదా.. నాలుగేళ్లకుపైగా మూడు రాజధానులు పేరుతో వైసీపీ సర్కారు ఆడుతున్న నాటకం, కేంద్ర ప్రభుత్వ విభాగాలను, బ్యాంకుల్ని, పీఎస్‌యూల్ని.. ఇతర సంస్థల్ని.. తీవ్ర గందరగోళంలోకి నెట్టేసింది. గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో స్థలాలు తీసుకున్న 47 కేంద్ర ప్రభుత్వ విభాగాలు, పీఎస్‌యూల్లో.. ఎన్‌ఐడీ తప్ప మరేవీ నిర్మాణాలు మొదలు పెట్టలేదు.
అమరావతిని విధ్వంసం చేయడానికి జగన్ కంకణం కట్టుకుని ఉండకపోతే.. పలు కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు.. ఇప్పటికే అక్కడ కొలువుదీరేవి. ఆర్‌బీఐ, ఆర్థిక, బీమా సంస్థలు, వివిధ ప్రభుత్వరంగ బ్యాంకులు వంటివి.. వాటి రాష్ట్ర కార్యాలయాల్ని ఏర్పాటు చేసేవి. వివిధ విద్య, పరిశోధన సంస్థలు ఏర్పాటయ్యేవి. వాటి వల్ల.. ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేలమందికి ఉపాధి లభించేది. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థల భవనాల నిర్మాణానికి వందల కోట్లు ఖర్చు చేస్తాయి కాబట్టి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ రూపంలోనూ భారీగా ఆదాయం లభించేది.
భవనాల నిర్మాణ సమయంలోనే కొన్ని వేల మంది కార్మికులకు ఉపాధి లభించేది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో.. పనిచేసే ఉద్యోగులు సమారు 15 వేల మంది వరకూ.. రాజధానికి వచ్చేవారు. వారు, వారి కుటుంబ సభ్యులకు వారికి అవసరమైన విద్య, వైద్యం, గృహవసతి, ఆహారం, వినోదం, నిత్యావసర వస్తువులు ఇలా వారి దైనందిన జీవితానికి కావలసిన సదుపాయాలు.. కల్పించే వృత్తి, వ్యాపారాల్లో కొన్ని వేలమంది ఉపాధి పొందేవారు.
Smart Cities Works in AP: ఏ అభివృద్ధైనా సరే.. మాట ఇచ్చాడా..మడమ తిప్పినట్లే..!
ఆర్థిక కార్యకలాపాలు.. ఊపందుకునేవి. రాజధానిపై జగన్ ప్రభుత్వం సృష్టించిన అనిశ్చితి వల్ల, అమరావతిపై అక్కసుతో.. రోడ్లు, డ్రెయిన్‌లు వంటి కనీస మౌలిక సదుపాయాల్ని కల్పించకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏపీకి రావడంలేదు. నాబార్డ్, ఆర్బీఐ సహా.. ఇప్పటికే ఏపీలో ఏర్పాటవ్వాల్సిన కార్యాలయాలు ఇప్పటికీ హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు సాగిస్తుండటంతో, ఏపీకి చెందినవారికి.. ఆ కార్యాలయాలతో పని ఉంటే వ్యయప్రయాసలకోర్చి అక్కడికి వెళ్లాల్సి వస్తోంది.
సీఎం జగన్ అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి గురించి.. కొత్త భాష్యాలు చెబుతూ ఉంటారు. మూడు రాజధానుల పేరుతో గత నాలుగు సంవత్సరాలుగా మూడు ముక్కలాట ఆడుతూ.. ఏ ప్రాంతాన్నీ అభివృద్ధి చేయకుండా.. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా రాలేని పరిస్థితి కల్పించడమే అభివృద్ధా? అసలు అభివృద్ధి అంటే ఈ ముఖ్యమంత్రికి నిర్వచనం తెలుసా?అమరావతిలో గత ప్రభుత్వ హయాంలోనే సీఆర్‌డీఏ నుంచి స్థలాలు తీసుకున్న 47 కేంద్ర సంస్థల్లో.. 29 కేంద్ర ప్రభుత్వ విభాగాలు, 18 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఉన్నాయి. 6 విద్యా సంస్థలు కూడా ఉన్నాయి.
State govt abandoned Amaravati: అమరావతిపై ఎందుకంత అక్కసు.. అవకాశం వచ్చినా మీ ప్రభుత్వానికి కనబడదా..!
ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి.. ఆరేడు బ్యాంకులు, హడ్కో, ఎల్‌ఐసీ వంటి ఆర్థిక, బీమా సంస్థలు ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి.. చమురురంగ సంస్థలు ఉన్నాయి. ఎన్‌డీఐకి 50 ఎకరాలు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్‌కు 5ఎకరాల్ని గత ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థకు.. ఏడాదికి చదరపు మీటరుకు రూపాయి చొప్పున 10 ఎకరాలను.. కేటాయించింది. రెండు కేంద్రీయ విద్యాలయాలకు 13ఎకరాల్ని ఎకరానికి రూపాయి చొప్పునలీజుకిచ్చింది. చాలా సంస్థలు 60 నుంచి 90 ఏళ్ల లీజుకు స్థలాలు తీసుకున్నాయి.
అన్నీ సవ్యంగా జరిగి.. రాజధాని నిర్మాణం యథావిధిగా కొనసాగి ఉంటే.. ఇప్పటికే ఆయా సంస్థలన్నీ రాజధానిలో తమ కార్యాలయాల నిర్మాణం.. పూర్తిచేసి ఉండేవి. ఎన్‌ఐడీ, ఎన్‌ఐఎఫ్‌టీ వంటి సంస్థలు విద్యార్థులతో.. కళకళలాడేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని పనుల్ని నిలిపివేయడం, 3 రాజధానుల పాట అందుకోవడంతో.. కేంద్ర సంస్థలేవీ నిర్మాణాలు ప్రారంభించలేదు.అప్పటికే ఎన్‌ఐడీ భవన నిర్మాణాలు ప్రారంభించినా నత్తనడకనసాగుతోంది.
అమరావతి విధ్వంసమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు.. ఆర్-5 జోన్ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్