ETV Bharat / state

ఆ డబ్బులు చెల్లిస్తేనే మలి విడత నిధులు.. కేంద్రం స్పష్టం

author img

By

Published : Apr 6, 2023, 7:42 AM IST

Central government anger on the Andhra Pradesh: ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను మళ్లించిన జగన్‌ సర్కార్‌పై.. కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్థిక సంఘం సొమ్మును..ఇతర అవసరాలకు వాడుకున్నందుకు 40 కోట్లు వడ్డీ కింద చెల్లించాలని ఆదేశింది. ఆ సొమ్ము చెల్లిస్తేనే..తదుపరి విడత నిధులను విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆర్థికశాఖ తేల్చిచెప్పింది.

Central anger on the state government
రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఆగ్రహం
వడ్డీ చెల్లిస్తేనే నిధులు.. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఆగ్రహం

Central government anger on the Andhra Pradesh: ఏపీ ప్రభుత్వంపై.. కేంద్రం కన్నెర్రజేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం కింద విడుదల చేసిన 489.8 కోట్ల రూపాయలను.. ఇతర అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించింది. వాటిని సకాలంలో.. వైద్య ఆరోగ్య శాఖకు బదలాయించలేక చేతులెత్తేసింది. ఇందుకుగాను 40 కోట్లను వడ్డీ కింద చెల్లించాలని.. కేంద్ర ప్రభుత్వం తాజాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మొత్తం డబ్బులను చెల్లిస్తేనే.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మలివిడత నిధులను విడుదల చేస్తామని.. స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇరకాటంలో పడ్డారు.

రాజ్యాంగబద్ధంగా 15వ ఆర్థిక సంఘం ద్వారా.. 2021-22లో 489.8 కోట్లు, 2022-23లో 489.8 కోట్లు, 2023-24లో 514.14 కోట్లు, 2024-25లో 540.18 కోట్లు, 2025-26లో 567.4 కోట్లు చొప్పున మొత్తం 2,601.32 కోట్ల రూపాయలను.. ఏపీకి కేటాయిస్తామని కేంద్రం తెలిపింది. ఈ మొత్తం నిధులతో.. ఉపఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణకు..అవసరమైన సదుపాయాలు కల్పించాలని కేంద్రం నిర్దేశించింది. ముఖ్యంగా 2,601.32 కోట్లలో.. 1,978.63 కోట్లను గ్రామీణ వైద్య సేవలు మెరుగు కోసం కేటాయించింది.

2021-22కి సంబంధించి.. 489 కోట్లను కేంద్రం రెండు దశల్లో 2022 అక్టోబరు నాటికి.. ఏపీ ప్రభుత్వానికి పంపింది. ఈ నిధులను 4 వారాల్లోగా వైద్య ఆరోగ్య శాఖకు పంపాలన్న నిబంధనను.. జగన్‌ సర్కార్‌ పట్టించుకోలేదు. ఇతర అవసరాలకు మళ్లించడంతో.. తిరిగి సర్దుబాటు చేయలేకపోయింది. కేంద్ర నుంచి ఒత్తిడి పెరగడంతో 2022 జులైలో 102 కోట్లు, మిగిలిన మొత్తాన్ని ఈ ఏడాది మార్చి రెండో వారంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు పంపింది.

నిధుల బదలాయింపులో.. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ తీరు పట్ల.. కేంద్ర ప్రభుత్వం ఆగ్రహాన్ని వ్యక్తంచేసింది. జరిగిన జాప్యానికి 7శాతం వడ్డీ చొప్పున లెక్కలు వేసి, 40 కోట్లు చెల్లించాలని.. ఇటీవల ఏపీ ఆర్థిక శాఖకు తాఖీదు పంపింది. ఈ మొత్తాన్ని చెల్లిస్తేనే.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 489.8 కోట్లను విడుదల చేస్తామని తేల్చిచెప్పింది.

వాస్తవానికి కేంద్రం ఇచ్చిన నిధులకు అదనంగా.. ఒక రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం.. ఖర్చు పెట్టాల్సిన అవసరంలేదు. వచ్చిన నిధులను వచ్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు బదలాంచినట్లయితే.. ప్రస్తుతం ఈ వడ్డీ చెల్లింపు ఆదేశాలు వచ్చేవికావు. ఈ నిధులకు రాజ్యాంగపరంగా భద్రత ఉందని అధికారులు అనేక సార్లు చెప్పినా.. ఏపీ ఆర్థిక శాఖ మాత్రం పట్టించుకున్న దాఖలాలులేవు. ఆర్థికశాఖ తాజాగా నిర్వహించిన సమావేశంలోనూ.. ఇదే అంశంపై చర్చ జరిగింది.

మలివిడత కేటాయించే నిధుల్లో 40 కోట్లు మినహాయించుకునేలా మార్గదర్శకాలు లేనందున.. కేంద్రానికి చలానా రూపంలో 40 కోట్లు చెల్లించక తప్పదని తెలిసింది. ఐతే మరోసారి ఇలా జరగకుండా చూస్తామని కేంద్రానికి హామీ ఇచ్చి.. 40 కోట్ల వడ్డీ విషయంలో మినహాయింపు పొందాలనే ఆలోచనలో.. రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఉన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ.. 13 వందల కోట్లు ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ నుంచి..వైద్య ఆరోగ్య శాఖకు విడుదల కాలేదు.

ముఖ్యంగా రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు అభివృద్ధి సంస్థకు.. 500 కోట్ల రూపాయల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. ప్రభుత్వాసుపత్రుల అవసరాలకు తగ్గట్లు.. మందులు, వైద్య పరికరాలు, సర్జికల్‌ వస్తువులు, ఫర్నిచర్, ఇతర సామగ్రిని సరఫరా చేసిన గుత్తేదారులు.. నిత్యం ఈ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొవిడ్‌ సమయంలో.. కొనుగోళ్లు జరిపినందుకు అయిన 150 కోట్ల బకాయిల చెల్లింపులు ఇప్పటివరకు జరగనేలేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.