Kidnapped Boy CCTV Footage: గుంటూరు జిల్లా అరండల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 23న అదృశ్యమైన నాలుగేళ్ల బాలుడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఓ మహిళ బాలుడిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు సేకరించారు. రోడ్డుపై మహిళ ముందు నడుస్తుండగా.. ఆమెను అనుసరిస్తూ బాలుడు నడుస్తున్నట్లు దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. మాయమాటలు చెప్పి అపరిచిత మహిళ బాలుడ్ని అపహరించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బాలుడి ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: