గుంటూరు జిల్లా తెనాలిలోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో సీబీఐ సోదాలు జరిగాయి. విశాఖపట్నం నుంచి వచ్చిన అధికారుల బృందం ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నారు. కార్యాలయం సమీపంలోనికి ఎవరినీ రానీయకుండా తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ పని చేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి అనే అధికారి రెండు లక్షల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని సీబీఐ అధికారి తెలిపారు. నిందితుడు ఒత్తిడికి గురై సొమ్మసిల్లి పడిపోగా... వైద్య బృందం వచ్చి చికిత్స నిర్వహించినట్లు సమాచారం. నిందితుడిని అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కి పంపుతామని సీబీఐ అధికారి తెలిపారు.
ఇదీ చదవండీ :