గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో లైమ్ స్టోన్ గనుల అక్రమ తవ్వకాలు జరిగాయన్న అభియోగంపై సీబీఐ కేసు నమోదైంది. పిడుగురాళ్ల మండలంలోని కోణంకి, దాచేపల్లి మండలంలో నడికుడి, కేశనపల్లి గ్రామాల్లో లైమ్ స్టోన్ గనుల తవ్వకాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టనుంది. ఈ కేసులో మొత్తం 17 మందిని నిందితులుగా చేర్చింది.
ఐపీసీ 379, 386, 420, 447 సెక్షన్లు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంస నిరోధక చట్టంలోని సెక్షన్ 3లతో పాటు ఖనిజాలు, పేలుడు చట్టం సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. 2010 జనవరి 1 నుంచి 2018 ఆగస్టు 9 మధ్య ఈ అక్రమాలు చోటు చేసుకున్నాయని ఎఫ్ఐఆర్లో పొందుపరిచింది. గతంలోనూ ఈ వ్యవహారంలో పిడుగురాళ్ల, దాచేపల్లి పోలీసుస్టేషన్లలో నమోదైన మొత్తం కేసులను సీబీఐ తీసుకోనుంది .
ఇదీ చదవండి
అతిధి గృహ నిర్మాణానికి చర్యలపై కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశా: ఆర్ఆర్ఆర్