ETV Bharat / state

హైదరాబాద్​లో పెటెక్స్​ ఎక్స్​పోలో పిల్లుల అందాల పోటీలు - petex show in hyderabad

Cat Show at Petex Expo: శునకాలు, పిల్లులు, వివిధ జాతుల పక్షులు, చేపల ప్రదర్శనతో హైదరాబాద్​లో ఘనంగా ప్రారంభమైన పెటెక్స్ ఎక్స్‌పోలో రెండో రోజు పిల్లులు సందడి చేశాయి. మొదటి రోజు శునకాలకు పలు పోటీలు నిర్వహించగా.. రెండో రోజు పిల్లులకు పలు అందాల పోటీలు నిర్వహించారు. పోటీలను వీక్షిస్తూ నగరవాసులు సందడి చేశారు.

Cat Show at Petex Expo
Cat Show at Petex Expo
author img

By

Published : Jan 29, 2023, 7:46 PM IST

పెటెక్స్​ ఎక్స్​పోలో పిల్లుల అందాల పోటీలు.. తరలివచ్చిన నగరవాసులు

Cat Show at Petex Expo: కుక్కలను ఇళ్లలో పెంచుకోవటం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇటీవల కాలంలో పిల్లుల పెంపకం కూడా ఎక్కువైంది. పెట్‌ పేరెంటింగ్‌లో భాగంగా చాలా మంది ఈ మధ్య కాలంలో పిల్లులను కూడా పెంచుకుంటున్నారు. అలాంటి పెంపుడు పిల్లులకు హైటెక్స్‌లో నిర్వహించిన పెటెక్స్‌లో అందాల పోటీలు నిర్వహించారు. పిల్లుల అందాల పోటీలను చూసేందుకు నగర నలుమూలల నుంచి ప్రజలు తరలి వచ్చారు. మొదటి రోజు 500 రకాలకు పైగా శునకాలతో డాగ్‌ షో జరిగింది.

రెండో రోజు 120 రకాల పిల్లులను ప్రదర్శనకు ఉంచి, అందాల పోటీలు నిర్వహించారు. దేశంలో కేవలం రెండు మాత్రమే ఉన్న టోయిగర్‌ జాతికి చెందిన పిల్లులు ప్రదర్శనలో అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ టోయిగర్ జాతి పిల్లులు అతి తక్కువ జనాభా ఉంటే.. అందులో రెండు పిల్లులు భారత దేశంలోనే ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ జాతి పిల్లులు రూ.8 నుంచి రూ.10 లక్షల వరకు ఖరీదు చేస్తున్నట్లు తెలిపారు. చూడటానికి సున్నితంగా కనిపించినప్పటికీ పిల్లుల్లో టోయిగర్ జాతి పిల్లులు ఎగ్రసివ్‌ బ్రీడ్‌ అని నిర్వాహకులు చెబుతున్నారు.

శునకాలు, పిల్లుల పోటీలతో పాటు ఏర్పాటు చేసిన పలు జంతువుల ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా చిన్నారులకు వివిధ జంతువులను చూపించేందుకు, నగర నలుమూలల నుంచి వారిని వెంట తీసుకుని తల్లిదండ్రులు వచ్చారు. ప్రదర్శనలో బెంగాల్ క్యాట్, ట్రెడిషనల్ లాంగ్ హెయిర్, హిమాలయన్ బ్రీటీస్ సార్ట్ హెయిర్, ఎక్సోటిక్ సార్ట్ హెయిర్‌ మెన్‌కున్‌ లాంటి బ్రీడ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

పిల్లలను ప్రదర్శనకు తీసుకు వచ్చేందుకు ఎంతో మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపారు. నేటితో ముగియనున్న పెటెక్స్‌కు పిల్లులు, కుక్కలను నగరవాసులు పెద్ద సంఖ్యలో తీసుకువచ్చే అవకాశం ఉంది. పెటెక్స్‌ కోసం ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారని నిర్వాహకులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.