వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులు, హత్యలు పెరిగిపోయాయని కోడెల ఆరోపించారు. మా కుటుంబంపై కక్ష పెంచుకున్న స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతో కొంతమంది అరాచక శక్తులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. గుంటూరులో ఓ వ్యాపారికి సీఎం పీఏనంటూ నాగరాజు అనే వ్యక్తి ఫోన్ చేసి మూడు లక్షలు డిమాండ్ చేయటమే దీనికి నిదర్శనమన్నారు. తన కుమారుడిపై ఆధారం లేని కేసులు పెట్టారన్నారు. మాపై కేసులు పెట్టే వాళ్లలో ఎక్కువమంది వైకాపాకు చెందిన వారేనన్నారు. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో నిజాయతీగా జీవించానన్నారు. తాను తప్పు చేసినట్లయితే ఏ విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ప్రవిత్రమైన అసెంబ్లీలో వైకాపా సభ్యులు దౌర్జన్యంగా, దౌర్భాగ్యంగా, అసభ్యంగా అవాస్తవాలతో చంద్రబాబుపై బురద జల్లే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఇదీచదవండి