ETV Bharat / state

నారా లోకేశ్‌పై పాత గుంటూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు - గుంటూరు పోలీస్‌స్టేషన్‌లో నారా లోకేశ్‌పై కేసు నమోదు

Cases on Nara Lokesh
నారా లోకేశ్‌పై కేసు నమోదు
author img

By

Published : Aug 17, 2021, 1:47 PM IST

Updated : Aug 17, 2021, 3:05 PM IST

13:43 August 17

case filed on Nara lokesh

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​పై గుంటూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.  గుంటూరులో హత్యకు గురైన బి.టెక్ విద్యార్థిని రమ్య మృతదేహానికి నివాళులు అర్పించేందుకు లోకేశ్​ వెళ్లారు. ఇదే సమయంలో వైకాపా నేతలు కూడా అక్కడకు రావటంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు తెదేపా నేతల్ని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. లోకేశ్​ను ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్​కు తరలించి ఏడు గంటలకు పైగా ఉంచారు. అనంతరం బెయిల్ పై విడిచిపెట్టారు. 

          కొవిడ్ నిబంధనల ఉల్లంఘనతో పాటు పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే అభియోగాలతో నారా లోకేశ్​పై పాత గుంటూరు స్టేషన్​లో కేసు నమోదు చేశారు. ఐపీసీ 341, 353, 147రెడ్ విత్ , 149 రెడ్ విత్ , 120బి సెక్షన్లు కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పాటుగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యేలు శ్రావణ కుమార్, దూళిపాళ్ల నరేంద్రపై కొత్తపేట స్టేషన్​లో కేసు నమోదైంది. రమ్య మృతదేహాన్ని జీజీహెచ్ నుంచి తరలించే సమయంలో అడ్డుకున్నారని..  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఎఫ్‌ఐఆర్​లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

Last Updated : Aug 17, 2021, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.