తెదేపా నేత యరపతినేని శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో యరపతినేని సహా... మరో 12మందిపై సత్తెనపల్లి డీఎస్పీ కేసు వేశారు. అక్రమ మైనింగ్ నేపథ్యంలో పిడుగురాళ్లకు చెందిన గురవాచారి ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. తనపై దాడి చేశారని గురవాచారి కోర్టును ఆశ్రయించారు. శ్రీనివాసరావుకు అప్పటి మైనింగ్ అధికారులు, పోలీసులూ సహకరించారని ఆరోపిస్తూ... గురవాచారి 2014లోనూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి...