సరకు రవాణాలో గుంటూరు రైల్వే డివిజన్ సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ విభాగంలో 90 శాతం వృద్ధిరేటును గుంటూరు డివిజన్ సాధించింది. సరకు రవాణా ఆదాయంలో మొత్తం 121 శాతం వృద్ధి నమోదు అయినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
భారీ ఆదాయం..
2.95 మిలియన్ టన్నుల రవాణాతో రూ. 427.40 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో సరకు రవాణాతో రూ. 193.40 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా.. 2020-2021లో అమాంతంగా రూ. 427.40 కోట్లకు చేరిందని వివరించారు.
ఇదీ చదవండి: