ETV Bharat / state

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​కు అమరావతి రైతుల సెగ - అమరావతి రైతుల నిరసన వార్తలు

సాయిబాబా దర్శనానికి వెళ్లిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​కు అమరావతి రైతుల సెగ తగిలింది. ఆయన కాన్వాయ్ చుట్టూ చేరి.. జై అమరావతి అంటూ నినదించారు. రాజధాని గ్రామాల్లో అన్నదాతల నిరసనలు 414రోజుకు చేరుకున్నాయి.

capital Farmers' protests reaches 414 days
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​కు అమరావతి రైతుల సెగ
author img

By

Published : Feb 3, 2021, 5:16 PM IST

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​కు అమరావతి రైతుల సెగ

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ కాన్వాయ్​ను అమరావతి రైతులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో శ్రీసత్య సాయి ఆలయంలో ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ మహిళలు పూజలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో సాయిబాబా దర్శనానికి వచ్చిన మంత్రిని చూసి..ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.

మంత్రి వెళ్లే సమయంలో ఆయన కారు చుట్టూ చేరి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. పోలీసులు మంత్రి వెల్లంపల్లిని పంపించారు. రాజధాని గ్రామాల్లోనూ రైతులు 414వ రోజు నిరసనలు దీక్షలు కొనసాగించారు.

ఇదీ చూడండి.

'ఈ-వాచ్‌' యాప్‌పై హైకోర్టులో లంచ్​ మోషన్​ పిటిషన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.