తమకు కేటాయించిన ప్లాట్లను ముందు సీఆర్డీఏ అభివృద్ధి చేయాలని.. ఆ తర్వాతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈనెల 31లోపు ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లు చేసుకోవాలని సీఆర్డీఏ ... రైతులకు నోటీసులు పంపించింది. అయితే రిజిస్ట్రేషన్‌కు అన్నదాతలు ఆసక్తి చూపించటం లేదు.
ప్లాట్లకు వెళ్లేందుకు సరైన మార్గం కూడా లేదని రైతులు వాపోతున్నారు. ముందు ప్లాట్లను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గురువారం తుళ్లూరు, మందడం, అనంతవరం గ్రామాల్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పెద్దగా రైతులు ముందుకు రాలేదు. కేవలం పదుల సంఖ్యలోనే రిజిస్ట్రేషన్ లు జరిగినట్లు సమచారం.
ఇదీ చదవండి: ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సీఆర్‌డీఏ నోటీసులు.. అమరావతి రైతుల అభ్యంతరం