పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని.. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం పిట్టుకోటిరెడ్డిపాలెంకు చెందిన అభ్యర్థులు శుక్రవారం ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. తమను నామినేషన్ వేయవద్దంటూ వైకాపా నేతలు దాడిచేసి గాయపరిచారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదుపై దర్యాప్తు చేసేందుకు బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు రాంబొట్లపాలెం, పిట్టుకోటిరెడ్డిపాలెం గ్రామాలను సందర్శించారు. గ్రామస్తులను, అధికారులను అడిగి వివరాలు సేకరించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ఇటువంటి ఘటనలు జరగకుండా నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తుతో పాటు పోలీస్ పికెట్లను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని.. వారికి రక్షణ కల్పిస్తామన్నారు.
ఇదీ చదవండి: