కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నందున రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని జనసేనాని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. జులై 10 నుంచి పదోతరగతి పరీక్షలు ఉంటాయని ప్రభుత్వం చెప్పటంతో... విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని అన్నారు. కరోనా వల్ల చాలా రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలు రద్దు చేశాయని గుర్తు చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోనూ పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని పవన్ కోరారు.
ఇదీ చదవండి