ETV Bharat / state

విద్యార్థులకు వైసీపీ సర్కార్ తీరని ద్రోహం - భారీగా తగ్గిన ప్రాంగణ నియామకాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 1, 2023, 6:53 AM IST

Campus Recruitment in IT Sector: రాష్ట్రంలో ప్రభుత్వం నైపుణ్య శిక్షణను నిలిపేసి.. విద్యార్థులకు తీరని ద్రోహం చేసింది. ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. ఇంజినీరింగ్‌ విద్యార్థుల శిక్షణ కోసం.. హై ఎండ్‌ నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని సీఎం జగన్‌ చెప్పినా.. ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు.

Campus_Recruitment_in_IT_Sector
Campus_Recruitment_in_IT_Sector
విద్యార్థులకు వైసీపీ సర్కార్ తీరని ద్రోహం - భారీగా తగ్గిన ప్రాంగణ నియామకాలు

Campus Recruitment in IT Sector: రాష్ట్రంలో ఐటీ రంగంలో 25 ఏళ్ల తర్వాత తొలిసారి భారీ సంఖ్యలో ప్రాంగణ నియామకాలు తగ్గాయి. విద్యా సంవత్సరం ముగింపు దశకు వచ్చినా.. కంపెనీలు నియామకాలను చేపడుతున్న దాఖలాల్లేవు. ఎక్సెంచర్, వర్చుసా, ఐబీఎం, కొన్ని స్టార్టప్‌ సంస్థలు.. అరకొరగా నియామకాలు చేపట్టాయి. ఎల్‌అండ్‌టీ, మైండ్‌ట్రీ, ఇన్ఫోసిస్, క్యాప్‌జెమినీ, కాగ్నిజెంట్‌ సంస్థలు నియామకాలపై ఇంతవరకూ ఇంజినీరింగ్‌ కళాశాలలకు ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదు.

హెచ్‌సీఎల్‌, విప్రో సంస్థలు.. కొన్ని కళాశాలల నుంచి డేటా తీసుకున్నా.. నియామకాలకు వచ్చేదీ.. లేనిదీ.. చెప్పలేదు. టీసీఎస్‌ జనవరిలో కళాశాలలకు వస్తుందని.. అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో జులై నుంచి ప్లేస్‌మెంట్ల ప్రక్రియ మొదలై అక్టోబరుతో ముగుస్తుంది. ఏవో కొన్ని కంపెనీలు మాత్రం జనవరి దాకా నియామకాల్ని చేస్తుంటాయి. కానీ.. ఈసారి ఆ వాతావరణమే కనిపించడం లేదు.

తగ్గిన క్యాంపస్ ప్రాంగణ నియామకాలు..పెరిగిన ఐటీ కోర్సులు

Reduced campus placements in AP: విశాఖపట్నంలోని ఓ కళాశాల ఏటా 2 వేలకు పైగా ఉద్యోగాలకు ఆఫర్‌ లెటర్లు పొందుతోంది. ఈ ఏడాది మాత్రం 250 మాత్రమే వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. విజయవాడలోని ఓ కళాశాలకు గతేడాది 1,100 ఆఫర్‌ లెటర్లు రాగా.. ఈసారి ఆ సంఖ్య 500 దాటలేదు. గుంటూరులోని ఓ ముఖ్య కళాశాలలో గతేడాది 1,200 మంది ఆఫర్‌ లెటర్లు పొందారు. ఈసారి 200 మందికే కొలువులు దక్కాయి.

రాయలసీమలోని ఓ ప్రముఖ కళాశాలలో గతేడాది 90 శాతం ప్రాంగణ నియామకాలు ఉండగా.. ఈసారి 25 శాతమే లభించాయి. ఏఐసీటీఈ గణాంకాలు చూసినా.. రాష్ట్రంలో ఈసారి ప్రాంగణ నియామకాలు భారీగా తగ్గాయి. 2019-20లో ఇంజినీరింగ్‌ కళాశాల్లలో ప్రవేశాలు.. 92 వేల 865 ఉండగా.. 48,064 మంది ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యారు.

క్యాంపస్​ ప్లేస్​మెంట్​లో కొలువు.. అక్కడ చాలా సులువు

2022-23లో లక్షా 32 వేల 67 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందినా.. 51,213మందే ప్రాంగణ నియామకాలకు ఎంపికయ్యారు. ప్రవేశాల సంఖ్యకు తగినట్లు ప్రాంగణ నియామకాలు పెరగకపోవడం, ప్రస్తుతం అసలు లేకపోవడం.. ఫ్రెషర్స్‌ను కలవరపెడుతోంది.

విద్యార్థులకు.. సాంకేతిక నైపుణ్యాలు ఉంటేనే సాఫ్ట్‌వేర్‌ సంస్థలు ఉద్యోగాలిస్తాయి. టీడీపీ హయాంలో ఇంజినీరింగ్‌ కళాశాలల్లో.. నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్ని విరివిగా నిర్వహించారు. వైసీపీ సర్కార్ వచ్చాక వాటిని ఆపేసింది. కోర్‌ ఇంజినీరింగ్‌ సివిల్, మెకానికల్, ఈఈఈ విద్యార్థులకు ఉపయోగపడే సీమెన్స్‌ ప్రాజెక్టును.. ప్రభుత్వం మూలకు నెట్టింది.

నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో యంత్రాలు తుప్పు పట్టిపోతున్నాయి. రాష్ట్రంలో శిక్షణ ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు చదువు పూర్తయ్యాక హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్తున్నారు. శిక్షణకు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. పేద విద్యార్థులకు ఇది పెనుభారంగా మారింది. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు విశాఖపట్నంలో ప్రత్యేక నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం జగన్‌ ఇప్పటికీ ఆ హామీని నిలబెట్టుకోలేదు. నైపుణ్య కళాశాలల్లోనూ విద్యార్థులకు ఉపయోగపడే శిక్షణ ఇవ్వకపోవడం వల్ల ప్రాంగణ నియామకాల్లో ఎంపికవడం కష్టంగా మారింది.

అధికారంలోకి రాగానే ఉద్యోగాలు భర్తీ చేస్తామని యువతను మోసం చేసిన జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.