అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గుంటూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. విద్యానగర్ పార్క్ నుంచి బృందావన్ గార్డెన్స్, మార్కెట్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, కలెక్టరేట్ మీదుగా... ఎన్టీఆర్ స్టేడియం వరకు ప్రదర్శన సాగింది. ఆంధ్రుల రాజధాని అమరావతే అంటూ నినాదాలు చేశారు. అనంతరం నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు ఇంటిని ముట్టడించిన ఆందోళనకారులు రాజధానిగా అమరావతే ఉండేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: