ETV Bharat / state

ఫోన్​ చూస్తే తండ్రి తిడుతున్నాడని కుమారుడి కిడ్నాప్ డ్రామా...

ఫోన్ ఎక్కువగా చూస్తున్నాడని తండ్రి మందలించటం ఆ బాలుడికి నచ్చలేదు. తన తండ్రిని బెదిరించాలని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి దుకాణంలో పనిచేస్తున్న 17 ఏళ్ల గుమాస్తాతో కలిసి కిడ్నాప్ పేరిట డ్రామా ఆడాడు. అటు తల్లిదండ్రులను.. ఇటు పోలీసులను పరుగులు పెట్టించాడు. ఇంత చేసిన ఆ బాలుడి వయసు కేవలం 12 ఏళ్లే.

boy kidnap
కుమారుడి కిడ్నాప్ డ్రామా
author img

By

Published : Nov 18, 2020, 12:15 PM IST

Updated : Nov 18, 2020, 10:59 PM IST

ఫోన్​ చూస్తే తండ్రి తిడుతున్నాడని కుమారుడి కిడ్నాప్ డ్రామా...

గుంటూరు జిల్లా సత్తెనపల్లి బాలుడి అదృశ్యం కేసు కొత్త మలుపు తిరిగింది. అదృశ్యమైన బాలుడే కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసుల విచారణలో తేలింది. సెల్​ఫోన్ ఎక్కువగా చూస్తున్నాడని తండ్రి తిడుతున్నాడనే ఇంతటి పని చేశాడని పోలీసులు నిర్దరణకు వచ్చారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నిన్న బాలుడు అదృశ్యమైన సంఘటన కలకలం రేపింది. వస్త్ర దుకాణం నిర్వహించే వెంకటేశ్వర్లు కుమారుడు వినయ్​. తరచూ ఫోన్ చూస్తుండే వాడు. దీన్ని గమనించిన తండ్రి రోజూ మందలించేవాడు. తండ్రి తిట్టడాన్ని సహించలేకపోయిన వినయ్​... తండ్రిపై కోపాన్ని పెంచుకున్నాడు.

తండ్రిని బెదిరించాలనే ఆలోచనకు వచ్చిన వినయ్​... దుకాణంలో పని చేస్తున్న 17ఏళ్ల ప్రమోద్​ రాజ్​కుమార్​తో మనసులో మాట చెప్పాడు. డబ్బులకు ఆశ పడిన అతను ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి కిడ్నాప్​ డ్రామాకు తెరతీశారు. ఇంట్లో నుంచి వెళ్తూనే తాతయ్య వద్ద ఉండే ఫోన్​లో సిమ్​ తీసుకెళ్లిపోయాడు వినయ్​.

అనుకున్న పథకం ప్రకారం... గుమస్తా ఇంట్లో వినయ్​ దాక్కున్నాడు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఇద్దరూ జాగ్రత్త పడ్డారు. తాతయ్య దగ్గర నుంచి తీసుకొచ్చిన సిమ్​ కార్డు ద్వారా వెంకటేశ్వర్లుకు ఫోన్​ చేసి వినయ్​ను కిడ్నాప్ చేసినట్టు చెప్పాడు. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. మున్నా గ్యాంగ్​ పేరుతో ఈ కాల్స్ చేశారు.

బెదిరిపోయిన వెంకటేశ్వర్లు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలో మరోసారి వెంకటేశ్వర్లకు ఫోన్ చేసిన వినయ్​... తన డిమాండ్లపై బేరాలు మొదలుపెట్టాడు. చివరకు 10 వేలు ఇస్తే చాలని చెప్పాడు. చివరకు వారు డిమాండ్ చేసినట్లే పట్టణ శివారులోని ఓ పాత కారు కింద 10వేల రూపాయల కట్టను పోలీసులు చెప్పినట్లే ఉంచాడు వినయ్ తండ్రి వెంకటేశ్వర్లు. ఆ మొత్తాన్ని తీసుకోవడానికి ఎవరూ రాలేదు. పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం కావడంతో ఆగంతుకులు దార్లోకి వచ్చారు.

దర్యాప్తు కొనసాగించిన పోలీసులు... ఏ ఫోన్​ నుంచి కాల్స్ వస్తున్నాయో గుర్తించారు. అది ఇంటినెంబరే అని తెలిసే సరికి ఇది పరిచయస్తులే పనిగానే అనుమానించారు. చివరకు కాల్స్​ వస్తున్న ప్రాంతాన్ని ట్రేస్ చేసి... వినయ్​ను పట్టుకున్నారు.

రాత్రంతా విచారించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు చెప్పాడు వినయ్. తన ప్లాన్​ ఆఫ్​ యాక్షన్ మొత్తాన్ని వివరించాడు. తండ్రిని బెదిరించాలనే ఇదంతా చేసినట్టు ఒప్పుకున్నాడు. వినయ్ సమాధానం విన్న పోలీసులు అవాక్కయ్యారు.

పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని... ఫోన్​లు ఇస్తున్నప్పుడు వాళ్లపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: అండగా ఉండాల్సిన కన్న బిడ్డలే గెంటేశారు !

Last Updated : Nov 18, 2020, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.