ETV Bharat / state

తాడేపల్లిలో బాలుడు కిడ్నాప్: రూ.5 లక్షలు డిమాండ్ - తాడేపల్లిలో బాలుడు కిడ్నాప్

గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఒకటో తరగతి విద్యార్థి అపహరణకు గురయ్యాడు. రూ.5 లక్షలు ఇవ్వాలని గుర్తుతెలియని వ్యక్తులు డిమాండ్ చేస్తున్నారు. బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

boy-kidnap-in-guntur-thadepalli
boy-kidnap-in-guntur-thadepalli
author img

By

Published : Dec 5, 2019, 11:57 AM IST

తాడేపల్లిలో బాలుడు కిడ్నాప్ : రూ.5 లక్షలు డిమాండ్

గుంటూరు జిల్లా తాడేపల్లిలో పార్థసారథి అనే బాలుడు అపహరణకు గురయ్యాడు. తమ కుమారుడిని శామ్యూల్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడంటూ..... బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్థసారథి తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లి జీవనం సాగిస్తుంటారు. బాలుడి తండ్రితో శామ్యూల్ సన్నిహితంగా ఉండేవాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించేవారు. బుధవారం సాయంత్రం కూడా ఇద్దరూ మద్యం తాగారు. మళ్లీ మద్యం తీసుకొస్తానని చెప్పి బాలుడిని శామ్యూల్ తన వెంట తీసుకెళ్లాడు. ఎంతకీ శామ్యూల్ తిరిగిరాలేదు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో... బాలుడి తల్లికి ఫోన్ చేసి 5 లక్షలు ఇస్తేనే మీ అబ్బాయిని విడిచిపెడతానంటూ బెదిరించాడని బాధితులు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు.. బాలుడితో పాటు నిందితుని ఫొటోను సామాజిక మాధ్యమాల్లో ఉంచి... ఎవరికైనా కనిపిస్తే సమాచారం అందించాలని కోరారు. ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

స్త్రీ జాతి భద్రత ఎవరికీ పట్టదా? మార్పు వచ్చేదెప్పుడు?

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.