గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు వద్ద శనివారం రాత్రి నిషాద ఘటన జరిగింది. కృష్ణాజిల్లా ఆముదాలపల్లి గ్రామానికి చెందిన ఇండ్లమూరి స్వరూప్(14) మేనమామ గ్రామం నాదెండ్ల మండలం సాతులూరు వచ్చాడు. మేనమామ కొడుకు విజయ్‌తో కలసి సమీపంలోని పెదనందిపాడు బ్రాంచ్ కాలువలో ఈతకు వెళ్లారు. ఇద్దరు చిన్నారులు ప్రవాహ వేగానికి తట్టుకోలేక కొట్టుకుపోయారు.
ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు విజయ్ను రక్షించారు. ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో స్వరూప్ గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కాలువ వద్దకు చేరుకున్నారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 8:30 గంటల సమయంలో బాలుడి మృతదేహం లభ్యమైంది.
ఇదీ చదవండి : ఎవరైనా సరే... కఠినంగానే వ్యవహరిస్తాం: సీపీ