ETV Bharat / state

అదృశ్యమైన 8 ఏళ్ల బాలుడు మృతి - గొరిజవోలులో అదృశ్యమైన బాలుడు మృతి వార్తలు

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలులో అదృశ్యమైన 8 ఏళ్ల బాలుడి మృతి చెందాడు. గ్రామ సమీపంలోని వాగు క్వారీ గుంతలలో గోనెసంచిలో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాలుడి తల్లితో సన్నిహితంగా ఉంటున్న వీరాస్వామి ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న అతనికోసం గాలిస్తున్నారు.

boy died who was missing in gorijavelu guntur district
అదృశ్యమైన 8 ఏళ్ల బాలుడు మృతి
author img

By

Published : Sep 20, 2020, 3:09 PM IST

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలులో అదృశ్యమైన 8 ఏళ్ల బాలుడి మృతి చెందాడు. తన కుమారుడు కనిపించట్లేదని తల్లి పల్లపు లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాదెండ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వీరాస్వామి మీద అనుమానంతో ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు. చెరువు వద్ద అతని బైక్ కనిపించటంతో వాగులో ముమ్మరంగా గాలింపుచేశారు. ఈ క్రమంలో బాలుడి మృతదేహం గోనెసంచిలో కనిపించింది.

పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మీ భర్త మృతి చెందటంతో వీరాస్వామి ఆమెను చేరదీసి ఉపాధి కల్పిస్తూ సన్నిహితంగా ఉంటున్నాడు. శుక్రవారం బాలుడి పుట్టినరోజు అయినందున వీరాస్వామికి కొంత నగదు ఇచ్చి బట్టలు, చాక్లెట్లు తీసుకురావాలని చెప్పింది. ఇంతలోనే లక్ష్మి పొలంలో పనిచేస్తున్న సమయంలో పాము కాటుకి గురైంది. వీరస్వామి ఆమెను నరసరావుపేట ఆసుపత్రిలో చేర్పించాడు.

ఆసుపత్రి నుంచి వీరాస్వాని ఇంటికి వచ్చి లక్ష్మి కుమారుడు యశ్వంత్​తో మాట్లాడటం... అతని మాట వినలేదని కొట్టడంతో బాలుడు మృతిచెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ క్రమంలో వీరాస్వామి ఒక గోనె సంచిని ద్విచక్రవాహనంపై పెట్టుకొని వెళ్లినట్లు గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. ఆ కోణంలో చురుగ్గా దర్యాప్తు చేసిన పోలీసులు వీరాస్వామి ద్విచక్రవాహనం ఆధారంగా బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. పరారీలో ఉన్న వీరాస్వామి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి..

8ఏళ్ల బాలుడు అదృశ్యం..తల్లితో సహజీవనం చేస్తున్నవ్యక్తిపై అనుమానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.