కల్తీ బ్లీచింగ్ పై వస్తున్న కథనాలతో గుంటూరు కార్పొరేషన్ అధికారులు కలవరపాటుకు గురవుతున్నారు. తాజాగా గుంటూరు సంపంత్నగర్లో మైదా పిండి, బ్లీచింగ్ కలిపి వీధులలో చల్లుతున్నారని స్థానికులు ఆరోపించారు. కరోనా సమయంలో ఇలాంటి అక్రమాలకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది సంపత్ నగర్‌కు చేరుకుని బ్లీచింగ్ పౌడర్‌ను పరిశీలించారు. అది మైదా పిండి కాదని సున్నం అని తేల్చారు. స్థానికుల ఆరోపణలను నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ తీవ్రంగా ఖండించారు.
సంపత్ నగర్ శివాలయం రోడ్డులో బ్లీచింగ్ చల్లాడానికి సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్ హైడ్రేటెడ్ లైం పౌడర్ (సున్నం) రోడ్డునకు నిర్దేశిత కార్నర్ లో ఉంచడమైందన్నారు. 3 కట్టల సున్నం, ఒక కట్ట బ్లీచింగ్ నిష్పత్తిలో కలిపి పరిసరాల్లో చల్లించటం జరింగదన్నారు. నిరాధారాలతో, అవగాహనరాహిత్యంతో స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేశారన్నారు.అవాస్తవ కథనాలు ప్రచారం చేసిన వారిపైన నగర పాలక సంస్థ న్యాయపరమైన చర్యలు తీసుకుంటుందని కమిషనర్ హెచ్చరించారు.