భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారయణ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యా, ఉద్యోగాల్లో పైకి ఎదిగేందుకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం 10 శాతాం రిజర్వేషన్లు కల్పించిందని తెలిపారు. కాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయడం లేదన్నారు. దీంతో అగ్రవర్ణాల్లోని పేదలు ప్రయోజనం పొందలేకపోతున్నట్లు లేఖలో వివరించారు.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లోని యువతకు మేలు జరగాలంటే తక్షణం రిజర్వేషన్లను అమలు చేయాలని... ఈ విషయంలో జోక్యం చేసుకుని రిజర్వేషన్లు అమలయ్యేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.