BJP President Somu on Prathipadu Issue: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంలో జరిగిన ఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. పత్తిపాడు ఘటనపై గుంటూరు జిల్లా పోలీస్ స్పందన కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు దళితులపై దాడులు చేస్తే తూతు మంత్రంగా కేసు పెట్టి వదిలేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ ఘటనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి సోమవారం ఏదో ఒక జిల్లాలో ప్రజా సమస్యల పైన అధికారులకు స్పందనలో వినతి పత్రం అందించే కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా నుంచి ప్రారంభించమన్నారు.
ప్రత్తిపాడు నియోజకవర్గంలో పాతమల్లాయాపాలెం గ్రామంలో దళిత కుటుంబాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 14వ తేదీన ఎస్సీ కాలనీకి చెందిన యువకులు నీలం జ్యోతి సాగర్, వారి కుటుంబ సభ్యులు అంబేడ్కర్ జయంతిని జరుపుకుంటున్న సందర్భంలో శంకర్రెడ్డి, రెడ్డి సుబ్బారెడ్డి, కమ్మ గోపిరెడ్డి, కాసు సీతారామరెడ్డి, వారి అనుచరులు ఆ దళిత కుటుంబంపై తీవ్రంగా దాడి చేశారని సోము వీర్రాజు తెలిపారు. ఈ దాడిలో వారికి గాయాలు అయ్యాయన్నారు. ఆ దళిత కుటుంబానికి సరైన రక్షణ కల్పిస్తూ.. దాడికి గల కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోము డిమాండ్ చేశారు. ఈ ఘటనపై బీజేపీ పోరాటం చేస్తే ఏదో తూతూ మంత్రంగా కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
"ఎస్సీ కాలనీకి చెందిన యువకులు నీలం జ్యోతి సాగర్, వారి కుటుంబ సభ్యులు అంబేడ్కర్ జయంతిని జరుపుకుంటున్న సందర్భంలో శంకర్రెడ్డి, రెడ్డి సుబ్బారెడ్డి, కమ్మ గోపిరెడ్డి, కాసు సీతారామరెడ్డి, వారి అనుచరులు ఆ దళిత కుటుంబంపై తీవ్రంగా దాడి చేశారు. బీజేపీ పోరాటం చేస్తే ఏదో తూతూ మంత్రంగా కేసులు పెట్టారు. ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలని స్పందనలో ఫిర్యాదు చేశాం. ప్రతీ సోమవారంలో స్పందన కార్యక్రమంలో ప్రజాసమస్యలపై ఫిర్యాదు చేస్తాం"-సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి: