దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ ఉచితంగా కొవిడ్ టీకా ఇస్తామని చెప్పిన ప్రధాని నరేంద్రమోదీకి.. భాజపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి(vishnuvardhan reddy) ధన్యవాదాలు తెలిపారు. అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వటం.. పేద ప్రజలకు మంచి చేసే నిర్ణయమని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ కోసం రాష్ట్రాలపై ఆర్థిక భారం పడకుండా చూశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు ఆ మిగులు నిధులను ప్రజారోగ్యానికి కేటాయించాలని ఆయన కోరారు. పేదలందరికి ఉచిత రేషన్.. నవంబర్ వరకు కొనసాగించాలన్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ నిర్ణయాలతో ప్రధానమంత్రి పేదల పక్షపాతి అని నిరూపించుకున్నారని అన్నారు.
ఇదీ చదవండి:
vishnuvardhan reddy: ప్రధాని మోదీ పేదల పక్షాపతి: భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డి - భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వార్తలు
కరోనా టీకాను దేశంలో 18ఏళ్లు దాటిన వారికి ఉచితంగా ఇస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీకి.. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి (vishnuvardhan reddy)ధన్యవాదాలు తెలిపారు. వ్యాక్సిన్ కోసం రాష్ట్రాలపై ఆర్థిక భారం పడకుండా చూశారన్నారు. ప్రధానమంత్రి పేదల పక్షపాతి అని నిరూపించుకున్నారని ఆయన అన్నారు.