Manam-Mana Amaravati: 'మనం - మన అమరావతి' పేరిట గుంటూరు జిల్లా భాజపా నేతలు నిర్వహించిన పాదయాత్ర ముగింపు సందర్భంగా.. తుళ్లూరులో భాజపా బహిరంగసభ నిర్వహించింది. ఈ సభలో జాతీయ, రాష్ట్రస్థాయి ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఏ దేశానికైనా, రాష్ట్రానికైనా ఒకటే రాజధాని ఉంటుందని.. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. మూడు రాజధానుల పేరుతో వికృతక్రీడకు జగన్ తెర లేపారని ఆరోపించారు. ఏపీలో భాజపాకు సీట్లు రాకపోయినా.. మోదీ రాష్ట్రానికి నిధులు ఇస్తున్నారని తెలిపారు. నిజమైన నాయకుడు అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తాడని పేర్కొన్నారు. జగన్ ఏం చేసినా అమరావతి నుంచి రాజధాని మార్చలేరని సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
అమరావతి రాజధానిగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదన్న సుజనాచౌదరి.. రాష్ట్రాభివృద్ధికి పాటుపడే పార్టీకి వచ్చే ఎన్నికల్లో పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 2019లో జరిగిన పొరపాటు మళ్లీ జరగకుండా చూసుకోవాలని.. 2024లో మళ్లీ పొరపాటు జరిగితే మనల్ని ఎవరూ రక్షించలేరని హితవు పలికారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఆలోచించి నడుచుకోవాలని.. రాజకీయాల్లో దుర్భాషలు మంచిది కాదన్నారు. అమరావతిని కాపాడుకోవాలంటే జగన్‌ను గద్దె దించాలని ఆదినారాయణరెడ్డి సూచించారు.
ఇవీ చదవండి: