లవ్ జిహాద్ పెరుతో గుంటూరుకు చెందిన యువతిని వేధిస్తున్న తౌసీఫ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని భాజపా మహిళ మోర్చా రాష్ట్ర కార్యదర్శి యామిని శర్మ కోరారు. నిన్న బాధితురాలు, మరికొందరు హిందూ సంఘాల నేతలు అర్బన్ ఎస్పీని కలసి 11 పేజీల నివేదిక ఇస్తే.. పోలీసులు ఆ సారాంశాన్ని మార్చి సంబంధం లేని సెక్షన్లు పెట్టి కేసును పక్కదారి పట్టిస్తున్నారన్నారు. పోలీసులు త్వరగా విచారణ జరిపి నిందితుడు తౌసీఫ్ చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు.
తనను లవ్ జిహాద్ పేరుతో వేధిస్తున్న తౌసీఫ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేస్తే.. ఇచ్చిన ఫిర్యాదు ప్రకనపెట్టి సంబంధం లేని సెక్షన్లు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారని బాధితురాలు తెలిపారు. నిందితుడు తౌసీఫ్ తండ్రి భాషా ప్రభుత్వ ఉద్యోగి కావడం వలనే.. కేసును తపుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. తనను ఎన్ని విధాలుగా తౌసీఫ్, అతని కుటుంబసభ్యులు వేధించారు అనే అంశాన్ని క్షుణ్ణంగా.. నివేదికలో పొందపర్చిన పోలీసులు ఆదిశగా కేసు నమోదు చేయలేదన్నారు. తక్షణమే పోలీసులు స్పందించి తగిన న్యాయం చేయాలని.. మరో ఆడపిల్లకు ఎలాంటి కష్టం రాకుండా చూడాలని వారు కోరారు.
ఇవీ చూడండి...: ఇంజనీరింగ్ విద్యార్థులకు గంజాయి అమ్ముతున్న ఐదుగురు అరెస్టు