అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ 200 రోజులుగా... రైతులు చేస్తున్న ఉద్యమానికి భాజపా నేతలు సంఘీభావం తెలిపారు. రాజధాని రైతులకు మద్దతుగా భాజపా రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ జూపూడి రంగరాజు ఆధ్వర్యంలో గుంటూరులో నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి నేటివరకు అన్ని రంగాలలో ఘోర వైఫల్యం చెందిందని జూపూడి రంగరాజు అన్నారు. ఇప్పటికే 63సార్లు హైకోర్టు మొట్టికాయలు వేసినా ఎలాంటి మార్పు రాలేదన్నాదని విమర్శించారు. ప్రభుత్వానికి రాజధాని విషయంలో ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. రాజధాని రైతులకు భాజపా అండగా ఉంటుందని.. అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: 3 రాజధానుల పేరుతో మూడు ముక్కలాట: చంద్రబాబు