BJP Leaders Comments On Capital : దిల్లీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో సీఎం జగన్ రాజధానిపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ రాజధాని అవుతుందని.. సీఎం కార్యాలయాన్ని విశాఖకు తరలిస్తున్నట్లు చెప్పడం అభ్యంతరకరమని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్పష్టం చేశారు. కోర్టు పరిధిలోని అంశంపై జగన్ ప్రకటన చేయడం కూడా అభ్యంతరకరమన్నారు. సీఎం వ్యాఖ్యలతో ఆయనకు రాజ్యాంగ వ్యవస్థలపై ఉన్న గౌరవం ఏంటో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలా దృష్టి మరల్చే కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తేవడంలో సీఎం విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రజల దృష్టి మరల్చడం కోసమే సీఎం ప్రకటన చేసినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. అట్టహాసంగా చేసిన దావోస్ పర్యటనలో ఒక్క పైసా.. పెట్టుబడి రాలేదని అన్నారు. ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో సీఎంకు ప్రజాదరణ తగ్గిందని తెలిపారు.
సీఎం కార్యాలయాన్ని విశాఖకు తరలిస్తున్నట్లు జగన్ చెప్పడం అభ్యంతరకరం. కోర్టు పరిధిలోని అంశంపై జగన్ ప్రకటన చేయడం కూడా అభ్యంతరకరం. సీఎం వ్యాఖ్యలతో ఆయనకు రాజ్యాంగ వ్యవస్థలపై ఉన్న గౌరవం ఏంటో అర్థమవుతోంది. ముఖ్యమంత్రి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలా దృష్టి మరల్చే కార్యక్రమాలు చేస్తున్నారు. -సత్యకుమార్, బీజేపీ జాతీయ కార్యదర్శి
ముఖ్యమంత్రి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలా దృష్టి మరల్చే కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తేవడంలో సీఎం విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రజల దృష్టి మరల్చడం కోసమే సీఎం ప్రకటన చేసినట్లు భావిస్తున్నట్లు తెలిపారు.
వివేకా హత్య కేసులో సీఎం కుటుంబసభ్యుల ప్రమేయమున్నట్లు వార్తల ద్వారా తెలుస్తోందని సత్యకుమార్ పేర్కొన్నారు. వివాదాలు సృష్టించే క్రమంలో వైషమ్యాలు పెంచుతున్నారని.. అధోగతిపాలైన రాష్ట్రాన్ని మరింత వెనక్కి నెట్టడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.
దిల్లీలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. జగన్ వ్యాఖ్యలు సుప్రీంకోర్టును అవమానించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సీఎం రాజకీయ కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాట్లాడిన కన్నా దిల్లీలో సీఎం వ్యాఖ్యలతో ఆయన అవగాహనరాహిత్యం బయటపడిందని విమర్శించారు. సుప్రీంలో కేసు పెండింగ్‌లో ఉండగా సీఎం ఎలా ప్రస్తావిస్తారని ప్రశ్నించారు. దీనిని కోర్టు ధిక్కరణ కింద సుమోటాగా సుప్రీంకోర్టు తీసుకోవాలని అన్నారు.
ఇవీ చదవండి: