ETV Bharat / state

విదేశీ విద్యాదీవెన పథకానికి నిధులు నిలిపివేయటాన్ని నిరసిస్తూ భాజపా ఆందోళన

author img

By

Published : Sep 2, 2021, 4:44 PM IST

విదేశీ విద్యాదీవెన పథకానికి నిధులు నిలిపివేయటాన్ని నిరసిస్తూ గుంటూరు కలెక్టరేట్ వద్ద భాజపా నేతలు ఆందోళన చేపట్టారు. ఉపకార వేతనాలు ఇవ్వకపోవడం వల్ల విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పదించి నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

concern
భాజపా నేతల భిక్షాటన

విదేశీ విద్యాదీవెన పథకానికి వైకాపా ప్రభుత్వం నిధులు నిలిపివేయటాన్ని నిరసిస్తూ భాజపా మైనార్టీ మోర్చా.. గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించింది. నేతలు జోలె పట్టి విరాళాలు సేకరించి నిరసన తెలిపారు. భిక్షాటన కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ, సాదినేని యామిని, మైనార్టీ, యువమోర్చా నేతలు పాల్గొన్నారు.

విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సాయం అందించాలని పాటిబండ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. భిక్షాటన ద్వారా వచ్చిన సొమ్మును కలెక్టర్​కు అందజేస్తామని తెలిపారు. ఉపకార వేతనాలు ఇవ్వకపోవడం వల్ల విదేశాల్లో చదువుతున్న బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని సాదినేని యామిని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యను పరిష్కరించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్​ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఇదీ చదవండి

DISHA ACT: 'దిశ చట్టాన్ని అవహేళన చేయటం తగదు..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.