గుంటూరు జిల్లాలో పురపాలక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వినుకొండలో జరిగిన ఎన్నికల ప్రచారంలో.. భాజపా మహిళ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సాధినేని యామిని పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ.. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వైకాపా అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే భాజపా-జనసేన బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలన్నారు.
నగరాభివృద్ధికి కేంద్రం కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని సొంత ప్రయోజనాలకు ఉపయోగిస్తుందని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని యామిని విమర్శించారు.
ఇదీ చదవండి: