మున్సిపల్ ఎన్నికల ముందు ఆస్థి పన్ను గురించి మాట్లాడని ప్రభుత్వం.. ఆ తర్వాత పన్నులు పెంచి ప్రజలపై భారం మోపిందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలతో ఓట్లు వేయించుకుని.. ఆ తర్వాత పన్నులు పెంచటం వారిని వంచించటమేనన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారమే ఆస్థిపన్ను పెంచినట్లు చెప్పటాన్ని తప్పుబట్టారు. ఆస్థి పన్ను రాష్ట్ర పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. వెంటనే పన్నుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి