ETV Bharat / state

రాజధానిగా అమరావతే ఉండాలన్నది భాజపా విధానం: సోము వీర్రాజు - సోము వీర్రాజు అప్​డేట్

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగాలనేది భాజపా విధానమని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కమలదళం పోరాటం కొనసాగిస్తుందని వివరించారు.

bjp leader somu verraju on amaravathi
సోము వీర్రాజు
author img

By

Published : Dec 17, 2020, 2:04 PM IST

Updated : Dec 17, 2020, 5:24 PM IST

రాజధాని అమరావతికి తాము కట్టుబడి ఉన్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాజధాని పరిరక్షణకు ఉద్యమిస్తామని వెల్లడించారు. రాజధాని అమరావతిలోనే కొనసాగాలనేది భాజాపా విధానమనీ... ఇందులో రెండో మాటకు తావులేదని పునరుద్ఘాటించారు. రాజధాని అమరావతి పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు.

7 వేల 2 వందల కోట్లతో ఆనాడు రాజధానిని నిర్మిస్తే చంద్రబాబు ఇప్పుడు దీక్షలు చేయాల్సిన అవసరం వచ్చేది కాదని సోమువీర్రాజు వ్యాఖ్యానించారు. గుంటూరులో పర్యటించిన సోము వీర్రాజు, లాడ్జ్ సెంటర్​లో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భాజపా పోరాటం కొనసాగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో తెలుగుదేశం కంటే తామే ముందుంటామని వీర్రాజు అన్నారు. ఒక శాతం ఓట్లు రాని సీపీఐకి గుర్తింపు లేదనీ, నారాయణ నాయకుడే కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి: పోలీసుల హైడ్రామా మధ్య జనభేరి సభకు చంద్రబాబు!

Last Updated : Dec 17, 2020, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.