దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూసే ఉద్దేశంతోనే అధికరణం 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని భాజపా జాతీయ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి అన్నారు. గుంటూరు కన్వెన్షన్ సెంటర్లో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన జనజాగరణ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో మాట్లాడిన ఆమె.. ఆర్టికల్ 370 రద్దుకు దారితీసిన పరిస్థితుల్ని వివరించారు. స్వతంత్రానికి పూర్వం, అనంతరం జరిగిన పరిణామాల్ని మాట్లాడారు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ప్రత్యేక.. పౌరసత్వం, జాతీయ పతాకం ఉండాల్సిన అవసరం లేదన్నారు. 70 ఏళ్ల పాటు దేశప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిష్కరించేందుకే మోదీ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: