ETV Bharat / state

అవకాశమిస్తే అవినీతి రహితంగా అభివృద్ధి చేస్తాం: కన్నా - guntur latest news

గుంటూరు నగరంలోని 36వ వార్డులో భాజపా నేత, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రచారం నిర్వహించారు. భాజపా-జనసేన కూటమికి అవకాశమిస్తే అవినీతి రహితంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు.

bjp leader kanna laxmi narayana attend to election campaigning in guntur
భాజపా నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
author img

By

Published : Feb 28, 2021, 9:51 PM IST

రెండు ప్రాంతీయ పార్టీలు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశాయని... భాజపా నేత, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాజపా-జనసేన కూటమికి అవకాశమిస్తే అవినీతి రహిత అభివృద్ధికి కృషి చేస్తామని కన్నా స్పష్టం చేశారు.

గుంటూరు శ్యామలానగర్ 36వ వార్డులో భాజపా-జనసేన అభ్యర్థి శనక్కాయల అరుణ తరఫున కన్నా లక్ష్మీనారాయణ ప్రచారం నిర్వహించారు. గుంటూరులో గతంలో తాము చేసిన అభివృద్దే తప్ప కొత్తగా చేసేందేమీ లేదని విమర్శించారు. ప్రస్తుతం ఇంటిప్లాన్, మంచినీరు, విద్యుత్ కనెక్షన్ తదితర అవసరాల కోసం స్థానిక ఎమ్మెల్యేకు ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీచదవండి.

ఎన్నికల రంగంలోకి పవన్... త్వరలోనే విశాఖ పర్యటన ఖరారు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.