గుంటూరు భాజపా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ జయంతి కార్యక్రమంలో ఆ పార్టీ మాజీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు. భారతరత్నఅటల్ బిహారీ వాజ్‌పేయీ చేసిన సేవలు మరువలేనివని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని ప్రపంచ స్థాయిలో సమున్నత స్థాయిలో నిలపడానికి వాజ్‌పేయీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రముఖ నగరాలను అనుసంధానిస్తూ... స్వర్ణ చతుర్భుజిని ప్రారంభించారు. కార్గిల్ యుద్ధ సమయంలో దేశ సత్తా చాటారని గుర్తుచేశారు.
ప్రధాని మోదీ వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా తీసుకువచ్చిన మూడు చట్టాలపై ప్రతిపక్షాలు ద్రుష్పచారం చేస్తున్నారని ఆరోపించారు. మార్కెట్ యార్డు సెస్ చెల్లించకుండానే రైతు తన వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా విక్రయించుకోవచ్చునని తెలిపారు. మార్కెట్ సెస్ అత్యధికంగా విధించే రాష్ట్రాలలో పంజాబ్ దే మొదటిస్థానం అన్నారు. ప్రస్తుత ఉద్యమాలన్నీ రైతు వ్యతిరేక ఉద్యమాలేనని కన్నా వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండీ...