ETV Bharat / state

విమర్శలకు తావిస్తోన్న బయోమెట్రిక్ విధానం

లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం.. రేషన్ ద్వారా బియ్యం, కందిపప్పు అందిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే రెండుసార్లు పూర్తయిన పంపిణీలో బయోమెట్రిక్​కు మినహాయింపు ఇచ్చింది. మూడో విడత పంపిణీలో వేలి ముద్రల విధానాన్ని మళ్లీ నిర్ణయించడం.. విమర్శలకు తావిస్తోంది.

Biometric approach to criticism in Andhra Pradesh
విమర్శలకు తావిస్తోన్న బయోమెట్రిక్ విధానం
author img

By

Published : Apr 29, 2020, 3:52 PM IST

మూడో విడత రేషన్ పంపిణీకి బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కారణంగా గత రెండు విడతల్లో బయోమెట్రిక్ విధానం నుంచి మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం... మూడో విడతలో మాత్రం అదే విధానాన్ని పాటించాలని చెప్పడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తీవ్రస్థాయిలో ఉన్న తరుణంలో వైరస్ బారిన పడిన వ్యక్తి తనకు తెలియకుండా ఈ-పాస్ యంత్రంపై వేలిముద్ర వేస్తే అందరికీ వైరస్ వ్యాపించే అవకాశం ఉందని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 73 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.