గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ వద్ద వలస కార్మికుల ఆందోళన ఫలించింది. బిహార్‌కు చెందిన 204 మంది వలస కార్మికులను అధికారులు వారి స్వస్థలాలకు పంపించారు. ముందుగా వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి.. 8 ప్రత్యేక బస్సుల్లో కొవ్వూరుకు తరలించారు. ఈ రాత్రికి బిహార్ వెళ్లే ప్రత్యేక రైలులో వారు తమ స్వగ్రామాలకు చేరుకోనున్నారు.
తమను స్వస్థలాలకు పంపించాలని గత వారం రోజుల నుంచి కార్మికులు ఆందోళన చేపట్టారు. ఎట్టకేలకు స్వస్థలాలకు వెళ్తున్నందుకు వారు ఆనందం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి..