ETV Bharat / state

బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్టు - 14 రోజుల పాటు రిమాండ్​ - Bigg Boss 7 Winner Arrest Reason

Bigg Boss 7 Winner Pallavi Prashanth Arrest : బిగ్​బాస్​ ఏడో సీజన్ విజేత పల్లవి ప్రశాంత్​ను సిద్దిపేట జిల్లాలోని అతని ఇంటి దగ్గర పోలీసులు అరెస్ట్​ చేశారు. అతడితో పాటు అతని సోదరుడిని కూడా అరెస్టు చేసిన పోలీసులు ఇద్దర్నీ నాంపల్లి కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ క్రమంలో విచారణ జరిపిన కోర్టు ఇరువురికి 14 రోజుల రిమాండ్ విధించింది.

Bigg Boss 7 Winner Pallavi Prashanth Arrest

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 8:35 AM IST

Updated : Dec 21, 2023, 9:26 AM IST

Bigg Boss 7 Winner Pallavi Prashanth Arrest: బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్ సహా అతని సోదరుడు మహవీర్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. షో లో విజేతగా నిలిచిన అనంతరం బయట హంగామా చేయడం, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం, పోలీసుల అదేశాలు బేఖాతరు చేయడంపై జూబ్లీహిల్స్ పోలీసులు మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన పోలీసులు నిన్న గజ్వేల్ మండలం కొల్గుర్‌లో ప్రశాంత్‌ను, ఏ2గా ఉన్న అతడి సోదరుడ్ని అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు.

రహస్య ప్రదేశంలో విచారించి వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి ఇద్దరికీ 14రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఇద్దరిని జూబ్లీ హిల్స్ పోలీసులు చంచల్‌గూడ జైలుకి తరలించారు . ఈ కేసులో మరో నిందితుడు వినోద్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాడిలో పాల్గొన్న మరో 14మంది యువకులను సైతం పోలీసులు విచారిస్తున్నారు.

సందడిగా శ్రీమతి అమరావతి కార్యక్రమం.. హాజరైన సినీనటి కామ్నాజెఠ్మలానీ

Bigg Boss 7 Winner Arrest : బిగ్‌బాస్‌ 7 ఫైనల్స్‌ నేపథ్యంలో ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ వద్దకు చేరుకున్న పల్లవి ప్రశాంత్‌, అమర్‌దీప్‌ అభిమానుల మధ్య గొడవ జరిగింది. టైటిల్‌ విజేతగా(Title Winner) నిలిచిన ప్రశాంత్‌, రాత్రి 12 గంటల సమయంలో స్టూడియోస్‌ నుంచి బయటకు వచ్చారు. దీంతో అభిమానులు ఘన స్వాగతం పలికారు. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్‌ బయటకు వచ్చారు. అనంతరం ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం మొదలైంది. పలువురు అభిమానులు రెచ్చిపోయి అమర్‌దీప్‌ కారుపై రాళ్లు విసిరేందుకు యత్నించారు. దీంతో దాదాపు ఐదుకు పైగా ఆర్టీసీ(RTC) బస్సుల ధ్వంసం అయ్యాయి.

CPI Narayana: బిగ్​బాస్​ షోపై సీపీఐ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు

Bigg Boss 7 Winner Arrest Reason : గొడవ జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అభిమానులను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించారు. ఈ సంఘటనపై రెండు వేర్వేరు కేసులను జూబ్లీహిల్స్‌ పోలీసులు సుమోటోగా తీసుకున్నారు. పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా ర్యాలీని నిర్వహించినందుకు కారణమైన విన్నర్​పై కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ దాడిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (RTC MD Sajjanar) ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సుల అద్దాలు పగుల గొట్టిన వారిపై ఫిర్యాదు చేసినట్లు ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఆస్థులను ధ్వంసం చేయడం సరికాదన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీస్ శాఖను కోరారు.

Pallavi Prashanth Parents about Arrest : పల్లవి ప్రశాంత్ అరెస్టు నేపథ్యంలో తమ కుమారుడు బిగ్​బాస్​లో గెలిచిన సంతోషం కూడా లేకుండా పోయిందంటూ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

BIG BOSS: 'బిగ్ బాస్ షోతో యువతకు ఏం సందేశం ఇస్తున్నారు'

Last Updated : Dec 21, 2023, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.