గుంటూరు జిల్లా బాపట్ల పురపాలక సంఘంలో విలీనమైన ఎనిమిది పంచాయతీలతో కలిపి మొత్తం 34వార్డులుగా పునర్విభజన చేసి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పురపాలిక కమిషనర్ భానుప్రతాప్ తెలిపారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. పురపాలక వార్డుల పునర్విభజన నోటిఫికేషన్‌ను ప్రజలు, ప్రజాప్రతినిధులు పరిశీలించి అభ్యంతరాలు, సలహాలు, సూచనలను ఈనెల 10వతేది సాయంత్రం 5 గంటల్లోగా పురపాలక కార్యాలయంలో కమిషనర్, అధికారులకు నేరుగా లేదా రాతపూర్వకంగా తెలియజేయాలని కోరారు.
కొండుభొట్లపాలెం, మరుప్రోలువారిపాలెం, ముత్తాయపాలెం, పడమర బాపట్ల, తూర్పు బాపట్ల పంచాయతీలు పూర్తిగా పట్టణంలో విలీనమైనట్లు తెలిపారు. ఆసోదివారిపాలెం పంచాయతీ, పిన్నిబోయినవారిపాలెంలో వల్లువారిపాలెం గ్రామం, అడవి పంచాయతీలో సూర్యలంక, ఆదర్శనగర్, రామ్‌నగర్, హనుమంతనగర్ గ్రామాలను పురపాలక సంఘంలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిందని తెలిపారు.
ఇదీ చదవండి: 'మా ఇంటి ఆవరణలో మందు బాటిళ్లు పెట్టారు... ఇది కుట్రే!'