ETV Bharat / state

అమరావతి రైతుల ఉద్యమానికి భారతీయ కిసాన్ సంఘ్​ మద్దతు

Bharatiya Kisan Sangh Support to Amaravti Farmers: అమరావతి రైతుల పోరుబాటకు.. భారతీయ కిసాన్ సంఘ్ మద్దతు ప్రకటించింది. ఇవాళ దిల్లీలో జరిగిన కిసాన్ గర్జనలో అమరావతి రైతులు పాల్గొన్నారు. ఈ వేదికపై న్యాయబద్దంగా పోరాటం చేస్తున్న అమరావతి రైతులకు తమ మద్దతు ఉంటుందని.. బీకేఎస్ నేతలు ప్రకటించారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Dec 19, 2022, 5:59 PM IST

Updated : Dec 19, 2022, 8:09 PM IST

Bharatiya Kisan Sangh Support to Amaravti Farmers: దేశ రాజధానిలో అమరావతి రైతుల ఆందోళన మూడో రోజు కొనసాగింది. తొలుత జంతర్‌మంతర్‌లో మహా ధర్నా నిర్వహించిన 17 వందల మంది రైతులు.. ఇవాళ రాంలీలా మైదానంలో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'కిసాన్ గర్జన' సభకు హాజరయ్యారు. అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన విధానం.. జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని అమరావతి ఐకాస నేతలు, బీకేఎస్‌ నేతలకు వివరించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కిసాన్‌ సంఘ్‌ నేతలు.. అమరావతి రైతు ఉద్యమానికి పూర్తి అండగా నిలుస్తామని ప్రకటించారు.

గత మూడేళ్లుగా అమరావతిలో జరుగుతున్న ఉద్యమానికి అండగా నిలిచినట్లు బీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవులు చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని నిర్మాణం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు అంగీకారం చెప్పడంతోనే రైతులు విలువైన భూములు త్యాగం చేశారని,.. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానులు అంటూ.. కొత్త రాగం అందుకుందని విమర్శించారు.

ఇవి చదవండి:

Last Updated : Dec 19, 2022, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.