ETV Bharat / state

క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు అరెస్ట్ - పెదరెడ్డిపాలెంలో క్రికెట్ బెట్టింగ్ అప్​డేట్​

ఐపీఎల్ క్రికెట్​పై బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా పెదరెడ్డిపాలెంలో జరిగింది. నిందితుల నుంచి నగదు, సెల్​ఫోన్లు, ల్యాప్​టాప్​లు స్వాధీనం చేసుకున్నారు.

betting bookies arrest
క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు అరెస్ట్
author img

By

Published : Sep 30, 2020, 12:11 AM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెదరెడ్డిపాలెంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. గ్రామంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్​లపై బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు.

బెట్టింగ్ నిర్వహిస్తున్న భవనం సుధాకర్​రెడ్డి, నరసరావుపేటకు చెందిన అబ్దుల్ వహాబ్​ను అరెస్టు చేసినట్లు వివరించారు. నిందితుల నుంచి 2 లక్షల 58 వేల రూపాయల నగదు, 13 చరవాణులు, 2 ల్యాప్​ట్యాప్​లు స్వాధీనం చేసుకున్నట్లు గ్రామీణ సీఐ వై అచ్చయ్య తెలిపారు.

ఇదీ చదవండి:

రంగులు మార్చారు... లక్ష్యాన్ని మరిచారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.