'ఆడపిల్లను రక్షిద్దాం - ఆడపిల్లను చదివిద్దాం ' కార్యక్రమ ముగింపు వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన 'బేటీ బచావ్- బేటీ పడావ్' కార్యక్రమానికి హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు రజనీ, ఉండవల్లి శ్రీదేవి, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ రంగాలలో ప్రతిభ కనపర్చిన జిల్లాలోని ఆడపిల్లలకు బహుమతులు అందజేశారు. ఆడపిల్లను ప్రతి ఇంటా శ్రీమహాలక్షిగా అదరించాలని మేకతోటి సుచరిత అన్నారు. దేశానికి స్వాతంత్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా... బాలికలు, మహిళలపై దాడులు జరగడం బాధాకరమన్నారు. ఇటువంటి ఘటనలకు స్వస్థి పలుకుతూ రాబోయే రోజుల్లో స్త్రీ.. ఒక శక్తిలా ఎదగలన్నారు. ఆడపిల్లలు ఉన్నత విద్య ద్వారా ఇలాంటి దురాఘతాలను రూపుమాపవచ్చని విడుదల రజనీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లల అభ్యున్నతికి పెద్దపీట వేసిందని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ అన్నారు. బాలికలు అన్ని రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇదీ చదవండి: