శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు.. ఈ రోజు ఉదయం 10.30 గంటల సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సన్నిహుతులు అందించిన సమాచారం ప్రకారం..
- కోడెల ఉదయం 10 గంటలకు భార్యతో కలిసి అల్పాహారం చేశారు.
- 10.10 గంటలకు తన నివాసంలోని మొదటి ఫ్లోర్ లో ఉన్న పడకగదికి వెళ్లారు.
- పడకగదిలోకి వెళ్లగానే తలుపు గడియపెట్టారు.
- గది గడియపెట్టిన విషయాన్ని గుర్తించిన భార్య.. కోడెలను తలుపు తీయాల్సిందిగా కోరారు.
- ఎంతకూ తలుపు తెరవకపోవడంపై.. అనుమానంతో వ్యక్తిగత గన్ మన్ ను పిలిచారు.
- వెనక డోర్ బద్దలు కొట్టి గన్ మన్ భార్య లోనికి వెళ్లారు.
- అప్పటికే ఫ్యాన్ కు కోడెల ఉరి వేసుకుని ఉన్నారు.
- 10.40 గంటలకు కారులో కోడెలను ఆసుపత్రికి తరలించారు.
- 10.50 గంటలకు బసవతారకం ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్థరించారు.
- 11 గంటల తర్వాత ఆసుపత్రి సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు.
- విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ సీఐ కళింగరావు.. ఎస్సై రాం రెడ్డిని ఆసుపత్రికి పంపించారు.
- కోడెల ఆత్మహత్య చేసుకున్న గదిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
- గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు.
- డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్, టాస్క్ ఫోర్స్ తో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.