ETV Bharat / state

'మేమెంతో.. మాకంతే' విజయవంతమైన బీసీ సదస్సు.. బీపీ మండల్ విగ్రహావిష్కరణ.. - బీసీలు బీపీ మండల్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు

BC Seminar: జనాభాకు తగ్గట్లు దామాషా ప్రకారం బీసీలు సామాజిక, ఆర్థికన్యాయం, రాజకీయ సాధికారత కోసం ఉద్యమించాలని బీసీల ఆత్మగౌరవ సభ డిమాండ్ చేసింది. గుంటూరులోని చిల్లీస్ సెంటర్ లో సామాజిక న్యాయయోధుడు బీపీ మండల్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సభకు రాష్ట్రంలోని అన్ని పార్టీల బీసీ నేతలతో పాటు పలువురు జాతీయ నేతలు హజరైయ్యారు.

బీపీ మండల్
బీపీ మండల్
author img

By

Published : Feb 12, 2023, 8:41 PM IST

BC Seminar: మేమెంతో.. మాకంతే.. నినాదంతో గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో ఏర్పాటు చేసిన బీసీల సదస్సు విజయవంతమైంది, రాజకీయ పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి బీసీ నేతలు హాజరయ్యారు. బీపీ మండల్ మనవడు సూరజ్ మండల్, ద్రవిడ కళగం పార్టీ అధ్యక్షుడు వీరమణి, వీసీకే పార్టీ అధ్యక్షుడు, ఎంపీ తిరుమావళన్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య, రాష్ట్ర మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల్, జోగి రమేశ్, కారుమూరి నాగేశ్వరరావు, విడదల రజనీ, ఎంపీ బీద మస్తాన్ రావు, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, టీడీపీ నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కూమార్, కాంగ్రెస్ నుంచి మాజీమంత్రి రఘువీరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, జనసేన నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పోతిన మహేశ్ పాల్గొన్నారు.

జనాభా ఎక్కువున్నప్పటికీ ప్రభుత్వాల నుంచి బీసీలకు సరైన ప్రోత్సాహం అందడం లేదని బీపీ మండల్ మనవడు సూరజ్ మండల్ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల గణన జరగాలని, ప్రైవేటురంగంలోనూ బీసీలకు రిజర్వేషన్లు అమలు జరగాలని డిమాండ్ చేశారు. బీసీలు అనుభవిస్తున్న 27 శాతం రిజర్వేషన్లు బీపీ మండల్ వల్లే సాధ్యమయ్యాయని ద్రవిడ కళగం పార్టీ అధ్యక్షుడు వీరమణి అభిప్రాయపడ్డారు. బీసీ కమిషన్ సిఫార్సులు పార్లమెంట్ గడప దాటకుండా అనేక శక్తులు అడ్డుకున్నాయని గుర్తు చేశారు.మండల్ కమిషన్ రిపోర్ట్ బుట్టదాఖలు అవకుండా అనేక పోరాటాలు జరిగాయన్నారు.

అగ్రకులాల ఆధిపత్యంతో 50 శాతానికి రిజర్వేషన్లు మించకుండా ముందరి కాళ్ళకు బంధాలు వేశారని వీరమణి అభిప్రాయపడ్డారు. జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. పేరుకు 27 శాతం ఉన్నా , బీసీలకు కేవలం 10 శాతం మాత్రమే రిజర్వేషన్లు అందుతున్నాయని చెప్పారు. సామాజీక న్యాయం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీల ఐక్యత దేశానికి అవసరమని... 2024లో దేశంలో బ్రాహ్మణ భావజాలం ఉన్న పార్టీలు అధికారంలోకి వస్తే ఇక రిజర్వేషన్లు ఉండవని వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళన్ అన్నారు. దేశంలో అన్ని జిల్లాల్లోనూ మండల్ విగ్రహాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

బీసీలంటే గతంలో గుర్తింపు ఉండేది కాదని.. తమ ప్రభుత్వంలో గణనీయమైన మార్పు వచ్చిందని మంత్రి విడదల రజనీ చెప్పారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా బీసీలదేనని.. జగన్ ప్రభుత్వం వచ్చాక బీసీలకు పెద్దపీట వేశారని చెప్పారు. ఓట్ల సమయంలో కులాల ప్రస్తావన ఉండవచ్చని... ప్రభుత్వ నిర్ణయాలలో కులతత్వం ఉండకూడదని బీపీ మండల్ చెప్పిన విషయాన్ని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ గుర్తు చేశారు. బీసీలు వెనుకబడిన కులాలు కాదని.. వెన్నెముక కులాలని వ్యాఖ్యానించారు.

బీసీలకు పేరుకే పదవులిచ్చే విధానం మారాలని..ఇప్పటికీ బీసీలు పల్లకి మోసే బోయిలుగానే మిగిలిపోతున్నారని మాజీమంత్రి టీడీపీ నేత కొల్లి రవీంద్ర అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన బీసీలు రాజకీయాల్లో ముందుకు రాలేకపోతున్నారని రవీంద్ర చెప్పారు. బీసీ జన గణన జరపడానికి ప్రభుత్వానికి ఎందుకు భయమని, ప్రవేట్ రంగంలోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

బీసీల సదస్సు విజయవంతం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.