అగ్రవర్ణ పార్టీలు... బీసీలను ఓటు బాంకులా చూస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ఆరోపించారు. స్వంత పార్టీ ఏర్పాటు ద్వారానే బీసీల సమస్యల పరిష్కారం, రాజ్యాధికారం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. బుధవారం గుంటూరు జిల్లా మాచర్ల లో జరిగిన ఓ సమావేశానికి శంకరరావు హాజరయ్యారు.
దేశ జనాభాలో, రాష్టంలో 52 శాతం బీసీలు ఉన్నారని... చట్ట సభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం లక్ష్యంగా సొంత పార్టీ ఏర్పాటు చేసుకొని రాజ్యధికార సాధనకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండీ...సీఎస్ నీలం సాహ్నికి.. ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో లేఖ