ETV Bharat / state

త్వరలో రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్‌ సర్వీసులు

రైతు భరోసా కేంద్రాల్లో త్వరలో బ్యాంకింగ్‌ సర్వీసులు నిర్వహిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ సాయి లక్ష్మీశ్వరి చెప్పారు. అన్నదాతలకు క్రెడిట్‌ కార్డులు ఇస్తామన్నారు. భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందజేస్తామన్నారు.

banking services in farmer bharosa centres in soon
త్వరలో రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్‌ సర్వీసులు
author img

By

Published : Jun 27, 2020, 5:36 PM IST

రైతు భరోసా కేంద్రాల్లో త్వరలో బ్యాంకింగ్‌ సర్వీసులు నిర్వహిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ సాయి లక్ష్మీశ్వరి చెప్పారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం హబ్​ను ఆమె పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా 11 వేల రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. 9600 కేంద్రాల్లో కియోస్క్‌ యంత్రాలు ఉన్నాయని.. మిగిలిన చోట్ల త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు.

రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వీటి ద్వారా అందజేస్తామన్నారు. అన్నదాతలకు క్రెడిట్‌ కార్డులు ఇస్తామన్నారు. 14 మంది నాణ్యత లేని విత్తనాల డీలర్లకు షోకాజ్‌ నోటీసులు అందజేసినట్లు చెప్పారు. ప్రతి రైతు ఈక్రాప్ బుకింగ్‌ చేసుకోవాలని జేడీఏ విజయభార్గవి సూచించారు.

ఇవీ చదవండి...

కరోనా వ్యాప్తి ప్రభావం: రేపటి నుంచి శ్రీకాళహస్తిలో లాక్ డౌన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.