ETV Bharat / state

సహకార బ్యాంకులో భారీ అక్రమాలు.. బినామీ పేర్లతో రూ.3.44 కోట్లు స్వాహా చేసిన మేనేజర్ - ప్రత్తిపాడు సహకార బ్యాంకులో భారీ అక్రమాలు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో భారీగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో బ్యాంకు మేనేజర్​గా పనిచేసిన వ్యక్తి.. బినామీ పేర్లతో రూ. 3.44 కోట్ల రుణాలు తీసుకొని సొంతానికి వాడుకున్నాడు. ఈ వ్యవహారంపై సహకార బ్యాంకు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

సహకార బ్యాంకులో భారీ అక్రమాలు
సహకార బ్యాంకులో భారీ అక్రమాలు
author img

By

Published : Feb 25, 2022, 3:43 PM IST

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో భారీగా అక్రమాలు జరిగాయి. గతంలో బ్యాంకులో పనిచేసిన మేనేజర్.. బినామీ పేర్లతో రుణాలు తీసుకొని సొంతానికి వాడుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు 58 మంది రైతుల పేరుతో రూ.3 కోట్ల 44 లక్షలు సొమ్ము స్వాహా చేసినట్లు తెలిసింది.

వెలుగులోకి ఇలా..
ఇటీవల ఆ బ్యాంకుకు కొత్త మేనేజర్‌ రాగా.. రుణాలు తీసుకున్న విషయం బయటపడింది. రైతులు రుణం తీసుకొని రెన్యూవల్ ఎందుకు చేయడం లేదని కొత్తగా వచ్చిన మేనేజర్ ఆరా తీశారు. పత్రాలలో ఉన్న ఫోన్ నంబర్లకు సిబ్బంది ఫోన్ చేశారు. అవి పని చేయకపోవడంతో... చిరునామాకు వెళ్తే అక్కడ అసలు విషయం తెలిసింది.

అప్పటి మేనేజర్ తన బంధువులు, స్నేహితులు అంటూ పలువురు రైతుల పేరుతో రుణాలు తీసుకున్నాడు. అక్రమాలకు పాల్పడిన మాజీ మేనేజర్ హైదరాబాద్, గుంటూరులలో ప్లాట్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. సహకార బ్యాంకు ఉన్నతాధికారులు.. ఈ అక్రమాలపై విచారణకు ఆదేశించారు.

ఇదీ చదవండి

chits cheating: చిట్టీల పేరుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఘరానా మోసం.. రూ.6 కోట్లతో పరారీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.