ETV Bharat / state

Balakrishna Birthday: బాలయ్య బర్త్​డే సెలబ్రేషన్స్.. అంబరాన్నంటిన సంబరాలు

author img

By

Published : Jun 10, 2023, 3:24 PM IST

Balakrishna Birthday celebrations: సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 63వ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా.. అంబరాన్నంటుతున్నాయి. పలు ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు, ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.

Etv Bharat
Etv Bharat

Balakrishna Birthday celebrations: రాష్ట్ర వ్యాప్తంగా సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 63వ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తిరుమలలో కూడా నందమూరి నటసింహం బర్త్​డే ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాయలసీమ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ శ్రీవారికి ఆలయ ఆఖిలాండం వద్ద 630 కొబ్బరి కాయలు, రెండు కేజీల కర్పూరం సమర్పించారు. నందమూరి బాలకృష్ణ ఆయురారోగ్యాలతో జీవించి ప్రజా సేవలో ముందుకు వెళ్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.

నెల్లూరు జిల్లాలో..
నెల్లూరు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు కొలాహలంగా సాగాయి. టీడీపీ నగర ఇంఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగాయి. తొలిసారి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డితో పాటు మాజీ మంత్రులు, టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, బీదా రవిచంద్ర, బీసీ జనార్దన్​లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అభిమానులకు కోలాహలం నడుమ కేక్ కట్ చేసిన టీడీపీ నేతలు, బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ రాణిస్తున్న బాలకృష్ణ రియల్ హీరోగా ప్రజల గుండెల్లో ఉన్నారని ఈ సందర్భంగా తెలుగుదేశం నేతలు కొనియాడారు.

కాగా నగరంలోని ఏసీ స్టేడియంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ కూడా.. బాలకృష్ణ జన్మదిన వేడుకలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడు, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రఘురాం ముదిరాజులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్టేడియంలో కేక్ కట్ చేసి, క్రీడాకారులకు మిఠాయిలు పంచి, బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయంగానూ రాణిస్తున్న బాలకృష్ణ.. ఎన్టీఆర్ బాటలోనే నడుస్తున్నారని ఈ సందర్భంగా పలువురు ఆయనను కొనియాడారు.

ప్రకాశం జిల్లాలో..
మరోవైపు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ కార్యలయంలో తెలుగు యువత జిల్లా నాయకులు షేక్ వలి ఆధ్వర్యంలో బాలయ్యబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా నియోజకవర్గ ఇంఛార్జ్ గుడూరి ఏరీక్షన్ బాబు పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. తన నటన ద్వారా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారని బాలకృష్ణను కొనియాడారు.

వైఎస్సార్ కడప జిల్లాలో..
ఈ క్రమంలో బాలయ్యబాబు సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా మూడు పాత్రలను పోషిస్తున్నారని కడప జిల్లా బాలకృష్ణ అభిమానం సంఘం అధ్యక్షుడు పీరయ్య అన్నారు. నందమూరి బాలకృష్ణ 63వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కడప వైఎస్సార్ సినిమా థియేటర్లో 63 కిలోల భారీ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు హాజరై కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై బాలయ్య అంటూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అభిమానులకు కేక్ పంపిణీ చేశారు.

బాలకృష్ణ జన్మదిన సందర్భంగా ఎస్ఆర్ సినిమా థియేటర్​లో నరసింహనాయుడు సినిమా ప్రదర్శిస్తున్నారు. బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారని తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నేడు పేరు ప్రఖ్యాతలు గడించారని తెలిపారు. అటు రాజకీయంలో, ఇటు ప్రజాసేవలో, వైద్య సేవలో రాణిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు. బాలకృష్ణ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. దసరాకు రాబోతున్న భగవంత్ కేసరి సినిమా విజయవంతం కావాలని కోరారు.

అనంతపురం జిల్లాలో..
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్​లో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్​చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు.

ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి ఉమామహేశ్వరనాయుడు మాట్లాడుతూ.. బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గంలో చేస్తున్న సేవలు మరువలేనివని వివరించారు. నందమూరి వంశంలో వారసుడుగా ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండాలన్న లక్షణం, ఎంతో క్రమశిక్షణ ఆయనలో పలుమార్లు గమనించామని అన్నారు. దీంతోపాటు బసవతారకం ఆస్పత్రికి ఛైర్మన్‌గా ఉండి పేదలకు ఆయన అందిస్తున్న సేవలు చిరస్మరణీయమని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు.

కర్నూలు జిల్లాలో..
నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నగరంలోని తెలుగు తోటలో బాలయ్య పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రానికి నందమూరి వంశం చేసిన అభివృద్ధి ఎవరూ చేయలేదని కళాకారులు తెలిపారు. కళామతల్లికి, రాష్ట్రానికి నందమూరి బాలకృష్ణ మరింత సేవలు చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.