చిన్నారిని కిడ్నాప్ చేసిందో యువతి గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని బ్రహ్మంగారి వీధిలో నివాసముండే తాండవ శ్రీనివాసులు, లావణ్య దంపతులకుఆరేళ్ల పాప.. శాంభవి ఉంది. గత నెల 20న వీరింటికి జొన్నదుల అంకమ్మ (22) అనే యువతి వచ్చి... పని ఇవ్వాలని అభ్యర్థించింది. లావణ్య దంపతులుదయాగుణంతో ఒప్పుకున్నారు. అప్పటి నుంచి ఆ కుటుంబ సభ్యులతోనే కలిసిపోయి వారి ఇంట్లోనే ఉంటోంది అంకమ్మ.ఈ నెల 3వ తేదీన సాయంత్రం ఆడిస్తానని చెప్పి.. పాపను బయటకు తీసుకెళ్లిన అంకమ్మ తిరిగిరాలేదు. చిన్నారి తల్లిదండ్రులు ఎంత వెతికినా వారి జాడ లభించలేదు. పాపను తనతో పాటే అంకమ్మతీసుకెళ్తుంటే చూశామని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు.. బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.